సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డీఎస్పీ శంకర్ రాజు ఆధ్వర్యంలో బీదర్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మతిస్థిమితం లేని వ్యక్తులను గుర్తించిన సీఐ రాజశేఖర్, ఎస్ఐ వెంకటేశ్.. వారికి హెయిర్ కటింగ్ చేశారు. డీఎస్పీ శంకర్ రాజు.. వారికి కొత్త దుస్తులు అందజేశారు.


మానవ సేవే మాధవ సేవగా భావించి నెలరోజులకోసారి పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తులను గుర్తించి హెయిర్ కటింగ్ చేయించి.. దుస్తులు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని డీఎస్పీ శంకర్ రాజు తెలిపారు. పోలీసుల సేవా గుణాన్ని పట్టణ ప్రజలు అభినందించారు.

- ఇదీ చదవండి : 'సైబర్' వలేస్తే.. ఖాతాదారు కత్తిరిస్తే..