ETV Bharat / state

సంగారెడ్డి కలెక్టరేట్​కు దక్కనున్న​ అరుదైన ఘనత.. ఐఎస్​ఓ గుర్తింపు! - ఐఎస్​ఓ 9001 14001

Sangareddy Collectorate: ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మరో అరుదైన ఘనత సాధించేలా అడుగులు వేస్తోంది. నాటి మెదక్.. ప్రస్తుత సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్.. ఉమ్మడి రాష్ట్రంలోనే మోడల్ కలెక్టరేట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల్లో నిర్మించిన కలెక్టరేట్లకు సైతం సంగారెడ్డి కలెక్టరేట్‌నే ప్రామాణికంగా తీసుకున్నారు.

sangareddy collectrate
సంగారెడ్డి కలెక్టరేట్​
author img

By

Published : Feb 11, 2023, 12:32 PM IST

సంగారెడ్డి కలెక్టరేట్​కు దక్కనున్న అరుదైన ఘనత

Sangareddy Collectorate To Get ISO Recognition: సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉమ్మడి రాష్ట్రంలోనే.. ఓ మోడల్ కలెక్టరేట్. సువిశాలమైన ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలున్ని ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మించారు. 2లక్షల 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన గదులు సభలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సుల కోసం ప్రత్యేకంగా హళ్లు నిర్మించారు. 2005లో నిర్మాణం ప్రారంభించి.. 2010లో పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జీ+2 తరహాలో నిర్మించిన తొలి కలెక్టరేట్ ఇదే. కేవలం భవనాలకే కాక.. పచ్చదనానికి సైతం అధిక ప్రాధాన్యమిచ్చారు.

ఎన్నో ప్రత్యేకతలున్న కలెక్టరేట్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి నిర్వహణ ప్రమాణాలు, పారదర్శకతకు ఐఎస్​ఓ 9001 సర్టిఫికేట్.. పర్యావరణ నిర్వహణ ప్రమాణాలు పాటించే కార్యాలయాలు, సంస్థలకు ఐఎస్​ఓ 14001 సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ రెండు గుర్తింపులు సాధించే అర్హత సంగారెడ్డి కలెక్టరేట్‌కు ఉండటంతో.. అధికారులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు గుర్తింపు సంస్థల ప్రతినిధులు కలెక్టరేట్‌ను సందర్శించారు. సంతృప్తి వ్యక్తం చేసిన ప్రతినిధులు.. కొన్ని సూచనలు చేశారు.

Sangareddy Collectorate ISO Recognition: ఆయా శాఖల నిర్మాణం.. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది నుంచి సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వివరాలతో కూడిన బోర్డులు కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాల లక్ష్యాలు.. అందించే సేవల సమాచారంతో కూడిన సూచికలు ఏర్పాటు చేశారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకులు ఎలా వ్యవహరించాలి.. ఎలా ఉండకూడదో తెలిపే పట్టికల్ని ఏర్పాటుచేశారు.

సిబ్బందిలో పారదర్శకత పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కార్యాలయాల్లో ఏ అధికారి ఏ విధి నిర్వర్తిస్తారో తెలిపే సమాచారం ప్రదర్శిస్తున్నారు. కార్యాలయంలో ఏ సెక్షన్‌లో.. ఏం పని జరుగుతుందో తెలిపేలా సూచికా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ చరిత్ర, ఇక్కడ పనిచేసిన అధికారుల జాబితా వంటి వివరాలు అందుబాటులో ఉంచారు. ప్రతినిధుల బృందం చేసిన సూచనలు అన్నీ అమలు చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌కు ఐఎస్​ఓ 14001, ఐఎస్​వో 9001 సర్టిఫికేషన్ ఇక లాంఛనమే. అందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

"మంత్రి హరీశ్​రావు, కలెక్టర్​ సూచనలు మేరకు కలెక్టరేట్​ను అన్ని విధాలుగా 9001లో ఉన్న సెక్యూరిటీ పరంగా, భవనాల పరంగా మంచిగా ఉన్నాయి. 14001లో ఉన్న పర్యావరణం, శుభ్రత, గ్రీనరీ వంటివి ఉన్నాయి. ఆ సంస్థవారు కూడా కొన్ని సలహాలు చేశారు." - వీరా రెడ్డి, అదనపు కలెక్టర్

"సంగారెడ్డి కలెక్టరేట్​కు ఐఎస్​ఓ 9001:14001 సర్టిఫికేట్​ విషయంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఆడిట్​ చేసుకుని వెళ్లడం జరిగింది. వారి రిక్వెర్​మెంట్​ సంతృప్తిగా ఉందని.. ఇంకా పలు సూచనలు చేసుకొని వెళ్లారు. ఇవి అయిన తర్వాత సర్టిఫికేట్​ వచ్చే అవకాశం ఉంది." - మహిపాల్‌రెడ్డి, ఏవో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.