ETV Bharat / state

"పార్లమెంట్​ ఎన్నికలకు సర్వం సిద్ధం"

పార్లమెంట్​ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఎస్పీతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.

author img

By

Published : Mar 11, 2019, 5:25 PM IST

పార్లమెంట్ ఎన్నికలపై వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికలపై వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

నామినేషన్ల వివరాలు...

ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 28న ఉపసంహరణ గడువు తేదిలు ఖరారైనట్లు తెలిపారు. ఏప్రిల్ 11న జిల్లా వ్యాప్తంగా 1557కేంద్రాలలో పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధం అయినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ సమన్వయంతో కలిసి పనిచేస్తామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి:అఖిలపక్షం నేతలతో ఎస్​ఈసీ సమావేశం

Intro:tg_wgl_61_11_collector_pcmeet_ab_c10
జనగామ జిల్లా కేంద్రంలోని మీడియా సెంటర్ లో జిల్లా పాలనధికారి వినయ్ కృష్ణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో, పాలకుర్తి, స్టేషన్ ఘానుపూర్ నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖలకు అధికారులను నియమించమని జిల్లా ఎన్నికల అధికారిగా అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తామని, అధికారలు మాత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా మొత్తంలో 857 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ సారి మరో 50 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని తెలిపారు. నామినేషన్ గడువుకు ముందు 10రోజుల వరకు ఓటరు నమోదు కార్యక్రమం చేస్తామని, ఎవరైనా ఓటు హక్కును నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపి వేశామని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈవీఎం, vv పాట్ యంత్రాల పనితీరుపై గ్రామాల్లో అవగహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బైట్: వినయ్ కృష్ణ రెడ్డి, జిల్లా పాలనధికారి, జనగామ.

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.