సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఓ ఇంట్లో తండ్రి, కుమారులకు కరోనా పాజిటివ్ రావడం వల్ల జిల్లా పాలనాధికారి హనుమంతరావు సందర్శించారు. గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
హోమ్ క్వారంటైన్లో ఉన్న వారందరూ అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. జిల్లా యంత్రాగం ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు . కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చర్యలతోపాటు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.