సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిథిలో ఏడో కంటైన్మెంట్ ప్రాంతమైన సాయికృపా నగర్, రామచంద్రాపురం, మయూరి నగర్ కాలనీలను జిల్లా పాలనాధికారి హనుమంతరావు పరిశీలించారు. అక్కడి పరిస్థితులను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న వారిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కంటైన్మెంట్ ప్రాంతంలో ప్రజలకు అందుతోన్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడిలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్