Drunken Woman Hakchal In Uppal : 'అవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. మద్యం తాగి ఠాణాకు వచ్చిన ఆమెను బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి చుక్కలు చూపించింది. ఊదమంటే ఊదకుండానే 'కోటర్ తాగి వచ్చిన. ఇంక ఊది ఏం చేయాలి' అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన ఈ మహిళ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ కీపర్‌గా పని చేస్తోంది. మద్యం తాగి అదే మత్తులో కనిపించి వారితో ఇలా గొడవకు దిగుతోందని, ఆ తర్వాత వారిపై ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందని పోలీసులు తెలిపారు.