పల్లెలను ప్రగతిపథంలో ముందుకు నడిపేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. జహీరాబాద్ మండలం రాయిపల్లి గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆమె పల్లె ప్రగతి పురోగతిని పరిశీలించారు.
గ్రామంలో మురుగు కాలువల శుభ్రత, నర్సరీ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రగతి పనులు చేపడుతున్న సర్పంచ్, ఎంపీడీవోలను అభినందించారు.
ఇవీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్