సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, అమీన్‌పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక పర్యటన చేశారు. ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. పటాన్‌చెరు మండలం కర్ధనూరు, అమీన్‌పూర్ మండలం వడక్‌పల్లి, కిష్టారెడ్డిపేట గ్రామాల్లో నిర్మించిన డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలను పరిశీలించారు.
తడి చెత్త, పొడి చెత్త ను వేర్వేరుగా వేయాలని దీనిపై గ్రామంలో ఉన్నవారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. డంపింగ్‌యార్డు నిర్వహణ కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధఇకారులు, సిబ్బందికి సూచనలు చేశారు. మున్సిపాలిటీ, పంచాయితీ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని, చిన్నపిల్లలు ఆడుకునేందుకు సామాగ్రి, మొక్కల పెంపకం పనులను పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.
ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు