ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల సంగారెడ్డి నుంచి విజయవాడకు మొదటి బస్సును సంగారెడ్డి డిపో మేనేజర్ నాగభూషణం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రారంభించామని ఆయన అన్నారు.
తెలంగాణ నుంచి ఆంధ్రాకు మొదటి బస్సును పంపిస్తున్నామన్నారు. సంగారెడ్డి నుంచి విజయవాడకు మూడు సర్వీసులు, తిరుపతికి ఒకటి, బెంగుళూరుకు ఒకటి, విశాఖపట్నంకు ఒక సర్వీసును అందిస్తున్నామన్నారు. ఈ సర్వీసులను వాడుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు.
ఇవీ చూడండి: 'ఏడాదైనా పాసు పుస్తకం ఇవ్వలేదు... అబ్దుల్లాపూర్మెట్లో రైతు ఆందోళన