ETV Bharat / state

Road Accidents on National Highway 44 : హైవేలపై ప్రమాదాలకు కారణాలు ఇవే.. ఇకనైనా పట్టించుకుంటారా..? - 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు

Road Accidents on National Highway 44 : జాతీయ రహదారి 44పై తరచు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణంపై స్థానికులు మండి పడుతున్నారు. రహదారుల నిర్మాణ లోపం కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు . అధికారులకు టోల్‌ వసూళ్లు చేసే శ్రద్ధ రహదారుల పర్యవేక్షణపై లేదంటూ స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు

National Highway 44
Road Accidents on National Highway 44
author img

By

Published : Aug 9, 2023, 8:00 AM IST

Road Accidents on National Highway 44 : తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవే కారణం... ఇకనైనా పట్టించుకుంటారా..?

Road Accidents on National Highway 44 : జాతీయ రహదారులపై నిర్వహణ లోపం.. వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. రోడ్డు మీద ఉన్న భయంకరమైన మూలమలుపులకు తోడు... సూచికలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాల (Raod Accidents on NH44) బారిన పడుతున్నారు. నిర్వాహకులకు టోల్‌ రుసుం వసూళ్లపై ఉన్న ఏకాగ్రత... రహదారుల పర్యవేక్షణపై కరవైందంటూ వాహనదారులు వాపోతున్నారు. మెదక్‌ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు... అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయంటున్నారు. ప్రభుత్వ లోపం వల్లే జాతీయ రహదారులు ఇలా నిర్మించబడ్డాయని దాని వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డునా పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Cause of Road Accidents on NH-44 : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై (National Highway 44) ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతున్న ప్రమాదాల కారణంగా.. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రహదారిపై భయంకరమైన మూలమలుపులకు తోడు... సూచికలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. పలుచోట్ల బ్లాక్‌స్పాట్లు ఏర్పాటు చేసినా.. వాటి నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది.

ఈ రహదారిపై గడిచిన రెండు నెలల వ్యవధిలో 15మంది మరణించారంటే.. వాటి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా అధికారులు రోడ్డు నిర్మాణ పనులు మంచిగా చేయాలని కోరారు. కాాగా ప్రభుత్వం ఇది వరకే టోల్ వసూళ్లపై తగు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించినా... చెడిపోయిన రోడ్ల పునఃనిర్మాణ పనుల గురించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. మరోవైపు రోడ్డు ప్రమాదాలు పెరగడానికి కారణం హైస్పీడ్‌, శిరాస్త్రం ధరించకపోవడం కారణాలు. కొందరు ఆకతాయిలు హైవేలపై వేళ్లాల్సిన స్పీడ్‌ కంటే ఎక్కువ వేగం వెళ్లడమే కారణం. ట్రాఫిక్ అధికారులు ఈ విషయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన, ఆకతాయిలపై చర్యలు చేపట్టినా కూడా మార్పులు రాకపోవడం బాధకరం.

జిల్లాలోని తూప్రాన్, మాసాయిపేట, చేగుంట, రామాయంపేట మండలాల పరిధిలో మూలమలుపుల వద్ద బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. అయినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తూప్రాన్ మండలంలో నాగులపల్లి వంతెనను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతో పూర్తి చేసినా... ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారిపై రోజూ దాదాపు 15 వేల వరకు వాహనాలు ప్రయాణిస్తుండగా.. మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Korutla Bus Accident Live Video : కొద్దిలో మిస్సైందిగా.. బైక్​ను తప్పించబోయి.. గుంతలోకి వెళ్లిన ఆర్టీసీ బస్సు

Adilabad Road Accident : ఒల్లు జలదరించే ప్రమాదం.. జస్ట్​లో మిస్.. వీడియో వైరల్

ORR Accidents Today : నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.