సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కారు టైరు పేలి అదుపుతప్పి బోల్తా పడటం వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఓల్డ్ బోయినపల్లికి చెందిన ఏడుగురు స్నేహితులు ముంబయి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో కార్తీక్, అరుణ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ: కేసీఆర్