ETV Bharat / state

అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : May 12, 2020, 12:37 PM IST

అత్యవసర బియ్యం సరఫరా పేరిట అధికారుల వద్ద పాస్​ తీసుకుని రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించిన వారిని సంగారెడ్డి జహీరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 100 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ration rice illegal transport from sangareddy district to maharastra
జహీరాబాద్​లో రేషన్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. జహీరాబాద్ పట్టణ శివారులో నిల్వ చేసిన రేషన్​ బియ్యాన్ని డీసీఎం వాహనంలో లోడ్​ చేస్తుండగా అక్కడికి అధికారుల బృందం చేరుకుంది.

ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన సుమారు 100 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని అక్రమార్కులు మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు.

బియ్యం అక్రమ నిల్వకు పాల్పడిన అక్రమార్కులు అత్యవసర బియ్యం సరఫరా పేరిట అధికారుల నుంచి పాస్​ పొందడం గమనార్హం. అక్రమ నిల్వలకు పాల్పడిన వ్యక్తులు, బియ్యం సేకరణపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.