సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో రాత్రి 11 గంటల సమయంలో ఉరుములు, మెరుపులు, గాలులతో కుండపోత వర్షం కురిసింది.
ఉలిక్కిపడ్డ జనం..
భయంకరమైన ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వానలకు నిద్రలో ఉన్న జనమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్ర లేచారు. కొంత సమయం ఆయా గ్రామస్తులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నంత పని అయ్యింది. ఫలితంగా కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు వేర్లతో సహా నేలరాలిపోయాయి.

అవన్నీ చెల్లా చెదురు..
కొందరి ఇంటి కప్పులు, రేకులన్నీ చెల్లా చెదురయ్యాయి. చెట్ల కొమ్మలు విరిగి జనావాసాల మీద పడ్డాయి. ఇంతటి భయంకరమైన వాతావరణంతో కూడిన వర్షం ఎన్నడూ చూడలేదని ఆయా గ్రామాల పెద్దలు అన్నారు. ప్రధానంగా ఇందిరా నగర్, బొర్గి, తడ్కల్ తదితర గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.
ఇవీ చూడండి : వారి సేవలు ఎనలేనివి... ప్రమోట్ చేయండి: మంత్రి ఈటల