ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య 35వ వర్థంతిని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
పేదల అభ్యున్నతి కోసం, కష్టజీవుల కోసం, ప్రజల సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్య అని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లలిత అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మహిళలు కృషి చేయాలని మహిళా సాధికారత సాధించడం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.
ప్రభుత్వాలు మహిళల పట్ల సానుభూతి తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని, అందుకే మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సుందరయ్య వర్థంతి సభలో నియోజకవర్గ కార్యదర్శి నర్సింహారెడ్డి మున్సిపల్ కార్మికులకు బియ్యం, పండ్లు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'