సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో మెటల్ మైనింగ్ ఏర్పాటుకు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.
లక్డారం గ్రామంలో సర్వే నంబర్ 738/1లో 7.5 హెక్టార్ల విస్తీర్ణంలో రఫ్ స్టోన్ మెటల్ మైనింగ్ ఏర్పాటుకు.. జిల్లా అదనపు పాలనాధికారి వీరారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అత్యధిక శాతం గ్రామస్థులు మైనింగ్ వ్యతిరేకించారు. మైనింగ్ సమయంలో పేలుళ్ల వల్ల చుట్టుపక్కల ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, సమీప ప్రాంతాల్లో పర్యావరణ దెబ్బతింటోదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమకు రాకపోకలు సాగిస్తున్న భారీ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
![publinc hearing on mining at lakdaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11016909_mining.png)
పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నా.. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ ఎన్జీవో సంస్థ ప్రతినిధులు మాత్రం మైనింగ్‌ను స్వాగతిస్తున్నామని, గ్రామస్థులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
ఇవీచూడండి: 140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత