జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను సంగారెడ్డిలో జిల్లా ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఘనంగా నిర్వహించింది. వారోత్సవాల్లో భాగంగా నేడు సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్ఓ రాధికా రమణి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపుగా వాడాలని డీఆర్ఓ రాధికా రమణి కోరారు. అధికారులు తమ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ముందు.. లైట్లు, ఫ్యాన్లను ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు.
- ఇవీ చూడండి : 'పౌర' చట్టంపై సుప్రీంలో సవాల్: భాజపా మిత్రపక్షం