జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన మదన్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను బీబీ పాటిల్ ప్రస్తావించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలపాలన్న నిబంధన కూడా పాటించలేదన్నారు. ఎన్నికల కమిషన్ను, ఓటర్లను వాస్తవాలు దాచిపెట్టి చట్టాలను ఉల్లంఘించిన బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మదన్ మోహన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. సుమారు 6వేల ఓట్లతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన మదన్ మోహన్ ను జహీరాబాద్ ఎంపీగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. స్పందించిన హైకోర్టు ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని బీబీ పాటిల్, ఈసీకి నోటీసులు జారీ చేసింది.
ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?