సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న కొంత మంది వ్యక్తులకు రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. అకారణంగా బయటకు వచ్చిన వారికి ఫైన్ వేశారు. కొందరు చలానా కట్టగా మరికొందరు రెవిన్యూ అధికారులపై తిరగబడ్డారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించడమే నేరమని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. అధికారులను ఆక్షేపించిన వారిపై పోలీసులు మండిపడ్డారు. అనంతరం ఆయా వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా.. 33వేలు దాటిన మృతులు