కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. సంగారెడ్డిలో పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టినా... ఉదయం 10 గంటల తర్వాత... ఏదో ఒక సాకుతో ప్రజలు రోడ్లపై తిరుగుతున్నారు.
ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనవసరంగా బయటతిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్