ETV Bharat / state

కళ్లు మూస్తూ... తెరుస్తూ... సందడి చేస్తున్నా విఘ్నేశ్వరుడు

గణనాథుడు కళ్లు మూసి తెరవడం... చెవులను ముందుకు వెనక్కి ఆడించడం మీరు ఎప్పుడైనా...చూశారా..! ఈ సన్నివేశాన్ని చూడాలంటే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్​నగర్ వినాయకుడిని దర్శించాల్సిందే మరీ...!

కళ్లు మూస్తూ...తెరుస్తూ...సందడి చేస్తున్నా విఘ్నేశ్వరుడు
author img

By

Published : Sep 11, 2019, 7:27 AM IST

Updated : Sep 11, 2019, 10:17 AM IST

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్​నగర్​లోని శ్రీ వరసిద్ధి వినాయక మండపం వద్ద నిన్న పల్లకిసేవా, పంచహారతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు తరలిరావడం వల్ల మండపం సందడిగా మారింది. ఇక్కడి గణనాథుడు కళ్లు మూసి తెరవడం, చెవులు వెనక్కి ముందుకి ఆడిస్తూ.. భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వినాయకుని వద్ద ఎలుకను వదిలిపెట్టగా...అది అక్కడే తిరగడం అందర్నీ ఆకర్షించింది.

కళ్లు మూస్తూ...తెరుస్తూ...సందడి చేస్తున్నా విఘ్నేశ్వరుడు

ఇదీచూడండి: బై బై గణేశా... నగరంలో నిమజ్జనాలు షురూ

Last Updated : Sep 11, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.