ETV Bharat / state

'ఆక్సిజన్​ సిలిండర్లను ఎందుకు అమర్చలేదు?'

కేంద్రం నుంచి వచ్చిన ఆక్సిజన్ సిలిండర్లను అమర్చకపోవడం సిగ్గుచేటని భాజపా జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ విమర్శిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ప్రాంతీయ ఆసుపత్రిని కార్యకర్తలతో కలిసి సందర్శించారు.

Oxygen cylinders were not installed at Patancheru Area Hospital in Sangareddy
'ఆక్సిజన్​ సిలిండర్లను ఎందుకు అమర్చలేదు?'
author img

By

Published : Jul 29, 2020, 3:36 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రాంతీయ ఆసుపత్రికి గత పది రోజుల క్రితం వెంటిలేటర్​ చికిత్సకు ఉపయోపడే ఆక్సిజన్ సిలిండర్లు వచ్చినా నేటికీ వాటిని అమర్చకపోవడం సిగ్గుచేటని భాజపా జిల్లా కార్యద్శి బైండ్ల కుమార్​ విమర్శించారు. ఆక్సిజన్ అందక ఎంతో మంది కరోనా రోగులు చనిపోతున్నారని.. రోజుకు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. వాటిని బిగించకుండా ఆసుపత్రిలో ఓ మూలనపెట్టడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే వాటిని అమర్చి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కుమార్​ డిమాండ్​ చేశారు. మహమ్మారి వ్యాపిస్తోన్నప్పటి నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుల బండి సంజయ్ పిలుపు మేరకు కార్యకర్తలు భయపడకుండా ప్రాణాలకు తెగించి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.