ETV Bharat / state

ఏడో కంటైన్మెంట్​ జోన్​గా సాయికృపా కాలనీ - అమీన్​పూర్​ మున్సిపాలిటీలో మరో కరోనా కేసు

పక్క పక్క కాలనీల్లో కరోనా కేసులు నమోదు కావడం వల్ల సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలోని సాయికృపా కాలనీలో మంత్రి హరీశ్​ రావు పర్యటించారు. ఈ ప్రాంతాన్ని ఏడో కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించాలని ఆదేశించారు.

one more corona positive case found in ameenpoor
ఏడో కంటైన్మెంట్​ జోన్​గా సాయికృపా కాలనీ
author img

By

Published : Apr 13, 2020, 2:18 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలోని సాయికృపా కాలనీలో ఓ బాలుడికి కరోనా పాజిటివ్​ వచ్చింది. ఈ ప్రాంతాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. సాయికృపా కాలనీతో పాటు... పక్కనే ఉన్న మయూరి నగర్​ కాలనీలో గతంలో కరోనా కేసు రావడం వల్ల ఈ ప్రాంతాన్ని ఏడో కంటైన్మెంట్​ ప్రాంతంగా ప్రకటించాలని మంత్రి ఆదేశించారు.

ఈ ప్రాంతాన్ని అధికారులు స్వాధీనంలోకి తెచ్చుకోవాలని... ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్​ రూపొందించిన యాప్​ ద్వారా సౌకర్యాలు పొందవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే వాట్సప్​ నెంబర్​ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు.

ఏడో కంటైన్మెంట్​ జోన్​గా సాయికృపా కాలనీ

ఇదీ చూడండి : రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.