సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధుడి శవం లభించింది. మృతుడు సదాశివపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు.
మృత దేహంపై రక్తపు మరకలు, గాయాలు ఉన్నాయని... ఘటనా స్థలంలో చాకు ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. శ్రీనివాస్ గురువారం నుంచి కనిపించని నేపథ్యంలో కుటుంబ సభ్యులు శుక్రవారం సదాశివపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: శంభో.. శివ.. శంభో..