సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు దానిని వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ గణపతి అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తెలిపారు. ప్రధానంగా యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విస్మరించకూడదని.. సమర్థవంతమైన పాలకులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి