ప్రజా ఆరోగ్యం, శాంతి భద్రతల దృష్ట్యా మే 1వ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) సెక్షన్‌లు అమలులో ఉంటాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. యాక్ట్ ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.
ప్రజా ధనాన్నికి నష్టం కలిగించిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు