లాక్డౌన్ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దు నుంచి వచ్చే అనుమతి లేని వాహనాలను అడ్డుకోవాలని నారాయణఖేడ్ డీఎస్పీ ఆర్. సత్యనారాయణ రాజు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా నాగలి గిద్ద మండలం మొర్గి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టును సందర్శించి వాహనాలను తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, అనుమతి పత్రాలు ఉన్నవాటిని మాత్రమే అనుమతించాలని సూచించారు.
అనవసరంగా తిరుగుతున్న వారిపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు. డివిజన్ పరిధిలో లాక్డౌన్ పగడ్భందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రాకుండా.. కరోనాను అరికట్టేందుకు సహకరించాలని కోరారు. కర్ణాటక సరిహద్దులో కర్ణాటక చెక్ పోస్ట్ ఉన్నందున కరస్ గుత్తి చెక్ పోస్టును మొర్గి చౌరస్తాలో ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇదీ చూడండి: 'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'