గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి నాబార్డు చేయూతను అందిస్తోందని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వైకే రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, మొగుండపల్లీ మండల్లాలో ఆయన పర్యటించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
జహీరాబాద్ మండల కేంద్రంలో నాబార్డు.. రాయితీపై అందజేసిన మేకలు, ఆవులు, కుట్టు మిషిన్ యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు వైకే రావు. 'మా తోట' అనే కార్యక్రమంలో భాగంగా గిరిజనులు పంట పొలాల్లో పెంచుతున్న మామిడి ఇతర పండ్ల మొక్కలు.. భవిష్యత్తులో వారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం