జహీరాబాద్ మండలం రాయిపల్లిలో గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల కార్యక్రమాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఊర్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి సాధించాలని తెలిపారు.
ఇవీ చూడండి: మాటాల్లోనే కాదు చేతల్లో చూపిస్తున్న కలెక్టర్