ETV Bharat / state

దివ్యాంగులకు సేవ చేస్తున్న తల్లులకు సత్కారం - కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం

కనీసం తమ అవసరాలను తీర్చుకోలేని తీవ్ర వైకల్యం గల పిల్లలకు సేవ చేస్తున్న తల్లులను సత్కరించారు ఇస్నాపూర్​ సర్పంచ్​ గడ్డం బాలమణి శ్రీశైలం. తల్లులను సత్కరించడం వల్ల తమకు తృప్తిగా ఉందని దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.

mothers who helps severely disabled persons honoured by sarpanch in sangareddy district
దివ్యాంగులకు సేవ చేస్తున్న తల్లులకు సత్కారం
author img

By

Published : May 11, 2020, 6:32 PM IST

సంగారెడ్డి జిల్లా పఠాన్​చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం సందర్భంగా తీవ్ర వైకల్యం గల దివ్యాంగులకు సేవ చేస్తున్న తల్లులను ఇస్నాపూర్ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం సత్కరించారు. ఒక్కొక్కరికి 2వేల 222 రూపాయల నగదు అందించారు.
మాతృమూర్తులకు సేవచేస్తున్న సేవలను గుర్తించి సత్కరించడం మా సంఘంలో ఆనవాయితీగా వస్తుందని టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ అన్నారు. తల్లులు మాకు చేస్తున్న సేవలకు తాము తిరిగి ఏం ఇచ్చుకోలేమని.. పెద్దలు వారిని సత్కరించడం వల్ల తృప్తిగా ఉందని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: కొత్తజంటకు క్వారంటైన్ ముద్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.