సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందపూర్, అనేగుంట గ్రామాల్లో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొని ఈత మొక్కలు నాటారు. గత రెండేళ్లుగా హరితహారంలో మొక్కలు నాటుతున్నా వాటిని రక్షించక పోవడం బాధకరమని ఫరీదుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. మొక్కలు నాటుతున్న సిబ్బందికి బాధ్యతలు అప్పగించి సంరక్షించాలని ఆదేశించారు. చెరువుగట్టు సమీపంలో దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
ఇదీ చూడండి : సంగారెడ్డిలో సినిమా షూటింగ్... ఎగబడ్డ జనం