రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా లక్డారం గ్రామ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.
రైతును వెన్నెముకగా గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్షేమ పథకాల ద్వారా వారిని ఆదుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతుల కోసం ప్రారంభించిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.