సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సీతారామపురం కాలనీలో రూ. 3.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మిషన్ భగీరథ పైప్ లైన్లు ఆయన ప్రారంభించారు.
ప్రణాళికాబద్ధంగా కాలనీలను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. త్వరలో చేపట్టబోయే హరితహారంలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.