ETV Bharat / state

సీఎం కేసీఆర్‌కు సన్మానం చేస్తా: జగ్గారెడ్డి - ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజా వార్తలు

సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభినందనలు తెలియచేశారు. తాను నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందని.. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేసిన రోజే పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్‌కు సన్మానం చేస్తానన్నారు.

సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి
mla Jagga reddy, sangareddy medical college
author img

By

Published : May 18, 2021, 6:44 PM IST

సంగారెడ్డికి మెడికల్‌ కళాశాలను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్మానంతోపాటు పాలాభిషేకం చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. శంకుస్థాపన చేసిన రోజే పార్టీలకతీతంగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా తాను ఒక ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమం చేస్తానన్నారు. సన్మానం చేసేందుకు మొదటి ప్రాధాన్యత అధికార పార్టీకి ఇచ్చినా.. తనకు రెండో ప్రాధాన్యత అయినా ఇవ్వాలని కోరారు.

మెడికల్‌ కళాశాలను ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి అభినందనలు తెలియచేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో చుట్టుపక్కల పది అసెంబ్లీ నియోజక వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.