తెరాస పాలనలో ప్రభుత్వ శాఖలన్నింటిలో కంటే.. వ్యవసాయశాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని.. మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో.. తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌లను మంత్రి ఆవిష్కరించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయశాఖ అధికారులను.. ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. త్వరలో పదోన్నతులు ప్రక్రియ ప్రారంభిస్తామన్న ఆయన.. వ్యవసాయ శాఖ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: మరోసారి తనకు అవకాశమివ్వాలని పట్టభద్రులకు పల్లా విజ్ఞప్తి