వింత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య సాయానికి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన సుమలత, అవినాశ్‌ల కుమార్తె అక్షయకు గత ఏడాదిగా మెడ చుట్టూ వాపు పెరుగుతోంది. లక్ష రూపాయలు ఖర్చు చేసినా... ఫలితం లేకపోయింది.
మూడ్రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా... ‘సిస్టిక్ హైబ్రోమా’ అనే వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్సకు 3 లక్షలు ఖర్చవుతుందని చెప్పగా... పాప తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారికి వ్యాధి విషయాన్ని గ్రామానికి చెందిన యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా సమాచారం ఇచ్చారు.
దీనికి స్పందించిన ఆయన.. అక్షయకు శస్త్రచికిత్స చేయించడంతో పాటు పూర్తిగా నయమయ్యే వరకు సహకారం అందిస్తానని రీట్వీట్ చేశారు. వెనువెంటనే ఈ నెల 11న సిటిజెన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాలని మంత్రి కార్యాలయం నుంచి తండ్రి అవినాశ్‌కు సూచించింది.
ఇదీ చూడండి: ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్ మ్యాన్