ETV Bharat / state

'కాంగ్రెస్, బీజేపీ ముసుగులో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారు'

Minister Harish Rao Spiritual Meating in Sangareddy : తెలంగాణ వ్యతిరేకులతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దోస్తానా చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాకుండా కుట్రలు చేసిన వారందరూ ఒక్కటయ్యారన్నారు. ఇవాళ సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.

Minister Harish Rao Fires on Congress Party
Harish Rao Spiritual Meating in Sangareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 5:03 PM IST

Minister Harish Rao Spiritual Meating in Sangareddy : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పార్టీలన్నీ.. సభలూ, సమావేశాలతో మరింత దూకుడు పెంచాయి. తెలంగాణ వ్యతిరేకులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దోస్తానా చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాకుండా కుట్రలు చేసిన వారందరూ ఒక్కటయ్యారన్నారు. అసలైన తెలంగాణ వ్యతిరేకి.. రేవంత్‌ రెడ్డి కాదా.. అని ప్రశ్నలు సంధించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.

War of Words Between Harishrao and Revanth Reddy : నువ్వా నేనా.. హరీశ్​రావు రేవంత్​రెడ్డి మధ్య మాటల యుద్ధం

తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్‌ వైపు ఉండాలి.. తెలంగాణ ఓడాలంటే రేవంత్‌ రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ వైపు నిలవాలని హరీశ్​రావు అన్నారు. రేవంత్‌(Revanth Reddy) ఎలాంటి వాడో గురువారం గాంధీ భవన్‌లో చూశామన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చింది ఎవరో చూశామని.. ఉస్మానియా విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరని.. క్రిమినల్‌ ఎవరో.. ఆ మైండ్‌ సెట్‌ ఎవరిదో అందరికీ తెలుసని హరీశ్​రావు ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి కర్ణాటక ప్రజలు ఏవిధంగా మోసపోయారో.. ఇటీవల ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Sivakumar) మాటల్లోనే స్పష్టమైందన్నారు.

తెలంగాణ రావటం ఇష్టంలేని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​తో బీజేపీ వాళ్లు చేతులు కలుపుతున్నారు. వంద కోట్ల మంది ఒప్పుకుంటేనే తెలంగాణ అని పలికిన.. తెలంగాణ రావడం నేను బతికుండగా కానే కాదన్న రాజశేఖర్ రెడ్డి, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ షర్మిళ ఇవాళ కాంగ్రెస్​కు సపోర్ట్ చేస్తున్నారు. లోపలకెళ్లి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఉంటారట. ఓట్లు చీలకూడదని తెలంగాణలో పోటీ చేయనంటారు. వీటన్నింటిని చూస్తుంటే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవవుతున్నారని అర్థమౌతోంది. మన రాష్ట్రాన్ని ఆగం చేయటానికి ద్రోహులంతా కాంగ్రెస్, బీజేపీ ముసుగులో వస్తున్నారు. మనమంతా జాగ్రత్తగా ఉండాలి.-హరీశ్​రావు, ఆరోగ్యశాఖ మంత్రి

Harish Rao Counter to Congress Guarantees : 'కాంగ్రెస్‌ హామీలు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుంది'

Minister Harish Rao Fires on Congress Party : నేడు తెలంగాణ.. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారుతుందని కొనియాడిన హరీశ్ రావు.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రిస్క్‌ తీసుకోవడం ఎందుకని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ(BJP Party), కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నాయని మంత్రి పలికారు. ఈసారి బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్‌ రనౌట్‌.. కేసీఆర్ సెంచరీ ఖాయమని హరీశ్​రావు పలికారు.

సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత.. జిల్లాలో పదివేల మందికి ఇంటిస్థలాల ఇచ్చే బాధ్యత తనదని మంత్రి హరీశ్​రావు హామీ ఇచ్చారు. తెలంగాణ వద్దన్న వ్యక్తి సంగారెడ్డిలో పోటీ చేస్తున్నారని.. కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిని(Jagga Reddy) ఉద్దేశించి మంత్రి విమర్శలు గుప్పించారు. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో ఏం చేశారని జగ్గారెడ్డికి ఓటు వేయాలని ప్రశ్నించారు.

Harish Rao on Rythu Bhima Scheme : రైతు పక్షపాతి కేసీఆర్.. రైతు బీమాకు ఐదేళ్లు పూర్తి​ : హరీశ్​రావు

కాంగ్రెస్ గెలిస్తే కుర్చీల కొట్లాట తప్ప మరేమీ ఉండదని వ్యంగ్యంగా మాట్లాడారు. గుండెల్లో నుంచి పనిచేసే నాయకుడు మనకు కావాలన్నారు. 24 రోజులు కష్టపడి పని చేస్తే ఐదేళ్లు మీకు సేవచేసుకుంటామని మంత్రి ప్రసంగించారు. కార్యకర్తలను చూస్తుంటే సంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని హర్షం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.