ETV Bharat / state

Harish Rao Speech at BRS Public Meeting : 'కేసీఆర్ దెబ్బకు బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్ రనౌట్.. బీఆర్‌ఎస్‌ సెంచరీ' - కాంగ్రెస్‌ మరియు బీజేపీలపై హరీశ్‌రావు ధ్వజం

Minister Harish Rao Speech at BRS Public Meeting at Zaheerabad : తెలంగాణలో హంగ్‌ వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అంటున్నారు.. కానీ ఈసారి కచ్చితంగా హ్యాట్రిక్‌ కొడతాం రాసి పెట్టుకొండి అంటూ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో పర్యటించి.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీఆర్‌ దెబ్బకు బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్‌ రనౌట్‌.. కేసీఆర్‌ మాత్రం సెంచరీ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.

Minister Harish Rao
Minister Harish Rao Speech at BRS Public Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 9:00 PM IST

Updated : Oct 7, 2023, 10:13 PM IST

Minister Harish Rao Speech at BRS Public Meeting at Zaheerabad : కేసీఆర్‌ దెబ్బకు బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్‌ రనౌట్‌.. కేసీఆర్‌ మాత్రం సెంచరీ కొడతారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్నాం.. ఈసారి కచ్చితంగా 100 సీట్లు గెలుచుకుంటామని(Telangana Assembly Election 2023) స్పష్టం చేశారు.

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు(Harishrao Zaheerabad Tour)పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.160 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత భాగారెడ్డి స్టేడియంలో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ(BRS Public Meeting)లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Harish Rao Comments on BJP and Congress: తప్పిపోయో.. పొరపాటునో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే కైలాసంలో పెద్దపాము మింగినట్లు అమాంతం కిందపడిపోతారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. నడ్డా వచ్చి తెలంగాణలో హంగ్‌ వస్తుందని అంటున్నారు.. కానీ ఈసారి కచ్చితంగా హ్యాట్రిక్‌ కొడతాం రాసి పెట్టుకొండని నడ్డాకు సవాల్‌ విసిరారు. మిస్టర్‌ నడ్డా 'తెలంగాణ గడ్డ.. కేసీఆర్‌ అడ్డా' అంటూ విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రంలో గెలవని నడ్డా.. తెలంగాణలో గెలుస్తారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీ ఫేక్‌ సర్వేలను పెడుతుందని ధ్వజమెత్తారు. జాకీ పెట్టిన తెలంగాణలో బీజేపీ లేవదు, కాంగ్రెస్‌ గెలవదని మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

"తప్పిపోయో.. పొరపాటున కాంగ్రెస్‌ వాళ్లకు ఓటు వేస్తే.. వైకుంఠపాళిలోని పెద్ద పాము మింగినట్లు కిందకు వచ్చేస్తారు. నడ్డావచ్చి ఈ రాష్ట్రంలో హంగ్‌ వస్తాదని అంటున్నాడు. వచ్చేది ఇక్కడ హంగ్‌ కాదు బిడ్డా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతాం. తెలంగాణ గడ్డ.. కేసీఆర్‌ అడ్డా. నడ్డా వస్తాడు హంగ్‌ అంటాడు. కాంగ్రెస్‌ వాళ్లు ఫేక్‌ సర్వేలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తారు. బీజేపీ లేవదు.. కాంగ్రెస్‌ గెలవదు. బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్‌ రనౌట్‌.. కేసీఆర్‌ సెంచరీ." - హరీశ్‌రావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

Minister Harish Rao Visited Mancherial : అంతకు ముందు మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం పడ్తనపల్లిలో టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. తెలంగాణలో గెలిపిస్తారంటూ అంటూ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఇక మీ పార్టీని డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే పరువైన దక్కుతుందని చురకలు అంటించారు. కర్ణాటకలో బీజేపీను బీఎల్‌ సంతోశ్‌ సర్వనాశనం చేశారు. తెలంగాణలోనూ ఆయన వల్ల బీజేపీ పతనం ఖాయమని విమర్శించారు.

Harish Rao Speech at BRS Public Meeting కేసీఆర్ దెబ్బకు బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్ రనౌట్.. బీఆర్‌ఎస్‌ సెంచరీ

Harish Rao Comments on Congress : జాకీ పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు: మంత్రి హరీశ్​రావు

Harish Rao at Gajwel Ring Road Opening : 'మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలు ఇచ్చే కేసీఆర్‌ కావాలా..?'

Last Updated : Oct 7, 2023, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.