ETV Bharat / state

మయూరినగర్​లో పర్యటించిన మంత్రి హరీశ్​రావు - latest news on Minister Harish Rao on a visit to Mayurinagar

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. కరోనా బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Minister Harish Rao on a visit to Mayurinagar
మయూరినగర్​లో పర్యటించిన మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Apr 6, 2020, 1:00 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మయూరినగర్​లో కరోనా కేసులు నమోదు కావడం వల్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పర్యటించారు. కాలనీలో తండ్రీ కొడుకులకు కొవిడ్-19 సోకడం వల్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబంలో ఉన్న ఇతర సభ్యులు, పని మనిషి, చుట్టుపక్కల ఇళ్ల వాళ్లకి సైతం పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారు ముందుకు వస్తే.. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం పటాన్​చెరు మండలం పాటి గ్రామ పరిధి నారాయణ ఐఐటీ క్యాంపస్​లోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నవారిని మంత్రి పరామర్శించారు. వారితో మాట్లాడి అందుతున్న సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి, జిల్లా పాలనాధికారి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

మయూరినగర్​లో పర్యటించిన మంత్రి హరీశ్​రావు

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.