ETV Bharat / state

కరోనా బాధితులకు ధైర్యం చెప్పిన హరీష్​రావు

కరోనా పాజిటివ్​ వచ్చిన బాధితుడికి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రి హరీష్​ రావు ఫోన్​ ద్వారా ఆరా తీశారు. ధైర్యం చెడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Minister Harish Rao Enquiry About corona patient
కరోనా బాధితులకు ధైర్యం చెప్పిన హరీష్​రావు
author img

By

Published : Jul 17, 2020, 5:24 PM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన రోగికి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో మంత్రి హరీష్ రావు చరవాణి ద్వారా ఆరా తీశారు. కొడకంచి గ్రామానికి పరిశీలనకు వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుసుకొని ఆమెకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

అక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది ఫోన్​ ద్వారా కరోనా బాధిత కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ప్రతి రోజు వారికి అందుతున్న వైద్య సేవల తీరు ఎలా ఉందో అడిగారు. అలాగే కావలసిన మందులు ఇస్తున్నారా అంటూ బాధిత కుటుంబ సభ్యులను అడిగారు. కరనాతో బాధపడుతున్న వారంతా త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.