ETV Bharat / state

ఎన్​పీఆర్​ను ప్రతి రాష్ట్రంలో అడ్డుకోవాలి: అసదుద్దీన్​ - ఎన్​పీఆర్​ను ప్రతి రాష్ట్రంలో అడ్డుకోవాలి: అసదుద్దీన్​

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లలో ఎలాంటి తేడా లేదని... రెండు ఒకే నాణానికి చెందిన రెండు వైపులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేరళ రాష్ట్రంలో ఎన్​పీఆర్​ను అడ్డుకున్న విధంగా.. మన రాష్ట్రంలో అడ్డుకోవాలని కేసీఆర్​ను కోరతామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంత వరకైనా పోరాడతానని.. చివరికి ప్రాణత్యాగనికైనా సిద్ధమని ప్రకటించారు.

Nrc_Protect_Mim_Meeting in sangareddy
ఎన్​పీఆర్​ను ప్రతి రాష్ట్రంలో అడ్డుకోవాలి: అసదుద్దీన్​
author img

By

Published : Jan 5, 2020, 5:42 AM IST

Updated : Jan 5, 2020, 8:00 AM IST

ఎన్​పీఆర్​ను ప్రతి రాష్ట్రంలో అడ్డుకోవాలి: అసదుద్దీన్​

దేశంలో భాజపా ప్రభుత్వం కులాలను, మతాలను విభజించి పాలిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఆరోపించారు. సంగారెడ్డి అంబేడ్కర్ మైదానంలో ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్లను వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ ఒక్క ముస్లిం సమస్య కాదని.. ఇది భారతావని సమస్యని పేర్కొన్నారు.

ఒక నిమిషం వీడియో చేయండి

పౌరసత్వం నిరూపించుకునేందుకు పేద దళితులు, గిరిజనులు, ముస్లిం, హిందువుల వద్ద ధ్రువపత్రాలు లేవని.. చట్టం అమలు చేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్​పీఆర్ అమలు చేస్తారని.. దానిని ప్రతి రాష్ట్రంలో అడ్డుకోవాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఈనెల 25న అర్ధరాత్రి జాతీయ జెండా ఎగురవేసి.. జనగణమన పడాలని.. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఒక నిమిషం వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని కోరారు.

రాజ్యాంగ పరిరక్షణకు కదిలిరావాలి...

దేశంలో పుట్టిన ముస్లిములంతా భారతీయ ముస్లింలని.. "వి ఆల్ ఆర్ ఇండియన్ ముస్లిం" అని స్పష్టం చేశారు. ప్రధాని మాట్లాడిన ప్రతి సారి పాకిస్థాన్ గురించే మాట్లాడుతారని... ఆయన భారతదేశానికి ప్రధానమంత్రా?... లేక పాకిస్థాన్​కు ప్రధానమంత్రా?... అని ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు పక్క దేశాల ప్రజలపై ఉన్న మమకారాన్ని... తన దేశంలో ఉన్న ప్రజలపై చూపాలని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లపై గళమెత్తిన ముస్లింలు

TG_SRD_58_04_NRC_PROTECT_MIM_MEETING_PKG_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ సీఆర్, ఎన్ పీఆర్ లలో ఎలాంటి తేడా లేదని.. రెండు ఓకే నాణానికి చెందిన రెండు వైపులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ మైదానంలో ఎన్ సీఆర్, సీఏఏ బిల్లులకు వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేరళ రాష్ట్రంలో ఎన్ పీఆర్ ని అడ్డుకున్న విధంగా.. మన రాష్ట్రంలో అడ్డుకోవాలని కేసీఆర్ ని కోరతామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంత వరకైనా పోరాడతానని.. చివరికి ప్రాణత్యాగనికైనా సిద్ధమని ప్రకటించారు..... SPOT VO1: దేశంలో బీజేపీ ప్రభుత్వం కులాలను, మతాలను విభజించి పాలిస్తుందని ఎంపీ అసదుద్దీన్ స్పష్టం చేశారు. ఎన్ సీఆర్, సిఏఏ చట్ట సవరణ సమస్య ఏ ఒక్క ముస్లిం సమస్య కాదని.. ఇది భారతావని సమస్యని పేర్కొన్నారు. పౌరసత్వం నిరూపించుకునేందుకు పేద దళితులు, గిరిజనులు, ముస్లిం, హిందువుల వద్ద ధ్రువపత్రాలు లేవని.. చట్టం అమలు చేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్ పిఆర్ అమలు చేస్తారని.. దానిని ప్రతి రాష్ట్రంలో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఈనెల 25న అర్ధరాత్రి జాతీయ జెండా ఎగురవేసి.. జనగణమన పడాలని.. రాజ్యాంగాన్ని కాపాడలంటూ ఒక నిమిషం వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని కోరారు..... BYTE బైట్: అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ VO2: భారతదేశం దేశంలో పుట్టిన ముస్లిలందరూ భారతీయ ముస్లింలని.. "వి అల్ ఆర్ ఇండియన్ ముస్లిం" అని స్పష్టం చేశారు. ప్రధాని మాట్లాడిన ప్రతి సారి పాకిస్థాన్ గురుంచే మాట్లాడుతాడని.. ఆయన భారతదేశానికి ప్రధాని హ? పాకిస్థాన్ కి ప్రధాని హ? అని ప్రశ్నించారు. అదే విధంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పక్క దేశాల ప్రజలపై ఉన్న మమకారాన్ని.. తన దేశంలో ఉన్న ప్రజలపై చూపాలన్నారు. బిల్లులను వ్యతిరేకిస్తూ మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో నిర్వహించిన సభలకు.. టిఆర్ఎస్ వేదిక పంచుకోమని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం బాధాకరమని.. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.... BYTE బైట్:అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ EVO: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని.. హక్కుల సాధన కొరకు చివరికి ప్రాణత్యాగనికైనా సిద్ధమని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ.
Last Updated : Jan 5, 2020, 8:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.