ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన రాముడు, అతని మేనల్లుడు త్రినాథ్‌లు మరో 20 మంది కార్మికులతో కలిసి... గీతం విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న బాయ్స్ హస్టల్ పనులకోసం సంవత్సరం క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. లాక్డౌన్లో భాగంగా నెలరోజులుగా పనులు నిలిచిపోయిన నేపథ్యంలో కూలీలు అక్కడే విశ్వవిద్యాలయ భవనంలోనే ఉంటున్నారు.
ఈనెల 24వ తేదీన కార్మికులు కలిసి... కొత్తగా నిర్మిస్తున్న భవనం కింద నుంచి పలు సామాగ్రి తొలి అంతస్తు నుంచి పైకి తీసుకెళ్తుండగా... ప్రమాదవశాత్తు త్రినాథ్ జారి కిందపడ్డాడు. తల వెనుక తీవ్ర గాయం కావడంతో ఇస్నాపూర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం బీరంగూడలోని పనేషియామెరీడియన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా... అప్పటికే చనిపోయిననట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: అన్ని అవయవాలపైనా కరోనా ముప్పేట దాడి!