గాంధీ మహాత్ముని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సంతోష్ కైలాస్ ఏర్పాటు చేసిన కరెన్సీ నోట్లపై దేశంలోని ప్రధాన నగరాల పిన్ కోడ్ ప్రదర్శనను ఎమ్మెల్సీ తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహా రెడ్డి, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎల్బీ స్టేడియంలో "ఫిట్ ఇండియా - ఫిట్ తెలంగాణ ఫ్రీడం రన్"