సమస్యలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయి రమాదేవి అన్నారు. ఇవాళ జరుగుతున్న లోక్ అదాలత్‌లో భాగంగా సంగారెడ్డి కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సమస్య జఠిలం కాకముందే పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టులలో కేసులు వేయడం వల్ల సమయం వృథా అవుతుందని... రాజీ మార్గమే ఉత్తమమన్నారు. కక్షిదారులు తమ సమస్యల నివృత్తికై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు.
ఇవీ చూడండి: పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ దిశానిర్దేశం