సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో 46వ జూనియర్ ఇంటర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న ప్రారంభమై... మూడు రోజుల పాటు జరగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన 66 జట్ల నుంచి 1200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పోటీల్లో ఎంపికైన రెండు జట్లు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు.
ఇదీ చూడండి : మానసిక ఒత్తిడితో ఆ మహిళ ఏం చేసిందంటే..