సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కానింగ్ పరికరం పాడై.. సంవత్సరం గడుస్తున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని జనజాగృతి సేన ఆధ్వర్యంలో పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. సిటీ స్కానింగ్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ప్రజల జేబుకు చిల్లు పడుతుందని, సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం, చిన్న పరికరం పాడైతే.. సంవత్సర కాలంగా పట్టించుకోకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి భద్రత లేనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు ఎందుకని ప్రశ్నించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోతే.. భిక్షమెత్తైనా.. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి సిటీ స్కానింగ్ పరికరం కొని ఇస్తామని జనజాగృతి సేన నేతలు తెలిపారు.
సిటీ స్కానింగ్ లేదని.. భిక్షమెత్తి నిరసన తెలిపిన జనజాగృతి సేన!
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కానింగ్ సౌకర్యం కల్పించాలని సంగారెడ్డి జనజాగృతి సేన ఆధ్వర్యంలో పట్టణంలో భిక్షమెత్తి నిరసన తెలియజేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కానింగ్ పరికరం పాడై.. సంవత్సరం గడుస్తున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని జనజాగృతి సేన ఆధ్వర్యంలో పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. సిటీ స్కానింగ్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ప్రజల జేబుకు చిల్లు పడుతుందని, సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం, చిన్న పరికరం పాడైతే.. సంవత్సర కాలంగా పట్టించుకోకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి భద్రత లేనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు ఎందుకని ప్రశ్నించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోతే.. భిక్షమెత్తైనా.. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి సిటీ స్కానింగ్ పరికరం కొని ఇస్తామని జనజాగృతి సేన నేతలు తెలిపారు.
ఇదీ చూడండి: అభాండాలకు బాధితులు న్యాయమూర్తులు