ETV Bharat / state

Jaggareddy Meets Rahul Gandhi: 'కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో మీరే చూస్తారుగా' - Telangana news

Jaggareddy Meet Rahul Gandhi: కాంగ్రెస్‌ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని తేల్చిచెప్పారు.

Jaggareddy
Jaggareddy
author img

By

Published : Apr 6, 2022, 8:27 PM IST

Jaggareddy Meet Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సేజ్‌ విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ సాయంత్రం దిల్లీలో రాహుల్‌గాంధీతో కుటుంబ సభ్యులతో కలిసి జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి తెరాస ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని జగ్గారెడ్డి అన్నారు. తెరాస, భాజపా, ఎంఐఎంలను ఏవిధంగా నిలదీయాలి? ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలనే దానిపై రాహుల్​తో చర్చించారని తెలిపారు.

మూడు పార్టీలను ఎదుర్కోవాలని రాహుల్‌ దిశానిర్దేశం చేశారని జగ్గారెడ్డి వివరించారు. రాహుల్‌తో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయానని స్పష్టం చేశారు. అప్పుడు చెప్పిన విషయాలేవీ గుర్తులేవన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని... రాష్ట్రంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని తేల్చిచెప్పారు. కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో మీరే చూస్తారని అని జగ్గారెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్‌గాంధీతో ఫొటో దిగడం ఆనందంగా ఉందని, అందుకే దిల్లీ వచ్చామని వివరించారు.

'నా కుటుంబంతో పాటు రాహుల్‌గాంధీని కలిశాం. చరిత్ర గల కుటుంబంతో ఫొటో దిగాలనే రాహుల్‌ను కలిశాం. ప్రజా సమస్యలపై తెరాస ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. భాజపా, ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. మూడు పార్టీలను ఎదుర్కోవాలని రాహుల్‌ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పార్టీలను నిలదీయాలని రాహుల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో 3 పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేస్తాం. ప్రజల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగా పోరాడుతుంది.' -- జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

ఇదీ చూడండి: 'ప్రజలకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్​ పార్టీ ఉద్యమం ఆగదు..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.