సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి మైదానంలో మార్చి 28న కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఎండీఆర్ యువసేన గౌరవ అధ్యక్షులు దేవేందర్ రాజు తెలిపారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ పోటీలు పెద్ద ఎత్తున జరుపనున్నామని అన్నారు. ఆ పోటీల్లో గెలిచిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ఆయన చెప్పారు.
యువత చెడు మార్గాలు వదిలి ఈ క్రీడలో ఆసక్తి కలగాలనే ఉద్దేశంతోనే పోటీలు చేపడుతున్నట్లు కుస్తీ పోటీల సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఐదు కేటగిరిల్లో ఆ క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎండీ యువసేన ఈ క్రీడలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఆ సంస్థ అధ్యక్షుడు మధు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఎవరి పదవులైనా ప్రజల కోసమే..: మంత్రి ఈటల