ETV Bharat / state

వసతి గృహాల నుంచి ఇళ్లబాట పట్టిన ఇంటర్​ విద్యార్థులు - సంగారెడ్డి జిల్లా తాజా వార్త

ఇంటర్​ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వసతి గృహాల నుంచి ఇంటి దారి పట్టారు.

inter examinations finished in sangareddy
వసతి గృహాల నుంచి ఇళ్లబాట పట్టిన ఇంటర్​ విద్యార్థులు
author img

By

Published : Mar 18, 2020, 2:32 PM IST

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష చివరిరోజు కావడం వల్ల విద్యార్థులు వారి మిత్రులకు వీడ్కోలు చెప్పుకున్నారు. పరీక్షలు అయిపోయాయన్న ఆనందంలో విద్యార్థులు కేరింతలు కొట్టారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని.. ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా విద్యార్థులు బయట ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించకుండా క్షేమంగా తమతమ ఇళ్లకు చేరుకోవాలని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారులు సూచించారు. పరీక్షలు ముగియడం వల్ల వసతి గృహాల నుంచి విద్యార్థులు ఇళ్ల బాట పట్టారు.

వసతి గృహాల నుంచి ఇళ్లబాట పట్టిన ఇంటర్​ విద్యార్థులు

ఇదీ చూడండి: 'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.