మనం లక్ష్యాన్ని కలనగాలని.. దానిని నిజం చేసుకునేందుకు కృషి చేయాలని ప్రముఖ చిత్ర దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కోన్నారు. గీతం విశ్వవిద్యాలయం ప్రమాణ 2020 కార్యక్రమం ప్రారంభోత్సవంలో భరద్వాజతో పాటు నౌకాదళ విశ్రాంత కమాండర్ వీకే జైట్లీ ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ ప్రమాణ కార్యక్రమం మూడు రోజులు సాగనుంది. ఇందులో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
నిబద్ధతతో ఉన్నత శిఖరాలు
సాధారణ కుటుంబాల నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు ఉన్నారని.. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భరద్వాజ విద్యార్థులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, నిబద్ధతతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కమాండర్ వీకే జైట్లీ తెలిపారు. భారత్కు చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి వారు.. విన్నూత్న ఆవిష్కరణలతో ప్రపంచ లీడర్లుగా ఎదిగారని.. వారి స్ఫూర్తితో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిచుకోవాలని జైట్లీ వివరించారు.
ఇవీ చూడండి: హాజీపూర్ కేసులో న్యాయం జరిగింది: పికెట్ పోలీసులు