రాష్ట్ర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు. అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎనిమిదో వార్డులో 52 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సీసీరోడ్లు, డ్రైనేజీ పనులు కౌన్సిలర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతి కార్యక్రమంలో అండగా ఉంటున్న నాయకులు, యువకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: ఓ పౌరుడి ట్వీట్‌కు కేటీఆర్ రెస్పాండ్.. అధికారులకు ఆదేశం